విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా స్వాగతం
లాక్డౌన్ తర్వాత విద్యారంగం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థుల రాక విషయంలో విశ్వవిద్యాలయాలకు సహకరిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. కాగా, జులై చివరిలో సింగపూర్ నుంచి 350 మంది విద్యార్థులు రావడానికి సిద్ధపడుతున్నారని కాన్బెర్రా, నేషనల్ యూనివర్సిటీలు తెలిపాయి. లాక్డౌన్ తర్వాత తొలిసారిగా వస్త్ను విదేశీ విద్యార్థులు వారేనని పేర్కొన్నారు. పరిశోధనారంగానికి సంబంధించిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తామని, రెండు వారాలపాటు క్వారంటైన్ తప్పదని సృష్టం చేశాయి. అయితే, ఈ ఏడాది చివరి వరకు సాధారణ విదేశీ ప్రయాణికులను అనుమతించే అవకాశం లేదని ఆ దేశ పర్యటక మంత్రి సైమన్ బర్మింగ్హామ్ చెప్పారు.













