యుఎస్ లో చదువుతున్న విద్యార్థులకు 50,000 డాలర్ల నిధులు
విదేశీ విద్యార్థులకు సరిహద్దులకు ఆవల ఆర్థిక సేవలు, ఉత్పత్తులను సరమైన ధరలలో అందించే గ్లోబల్ బ్యాంక్ అయిన జోల్వ్, నేడు తన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఈ 50,000 స్కాలర్షిప్ ఫండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన 10 మంది గ్లోబల్ స్కాలర్లకు వితరణ చేస్తారు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు 15 ఏప్రిల్ 2023 నుంచి అందుబాటులోకి రాగా, 30 జూన్ 2023న ముగుస్తాయి. ప్రోగ్రామ్ ఫలితాలు ఆగస్టు 1 నుంచి 15వ తేదీ 2023 మధ్య ప్రకటిస్తారు. జోల్వ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నాయకులను గుర్తించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ విద్యార్థులు తమ శ్రేష్ఠత, నాయకత్వ సామర్థ్యాన్ని మరియు సానుకూల ప్రభావాన్ని చూపే అభిరుచిని ప్రదర్శిస్తారు.
స్కాలర్షిప్ ఇంటర్వ్యూలు, ప్యానెల్ చర్చలతో సహా సమగ్ర ప్రక్రియను అనుసరిస్తుండగా, ప్రతి ఏడాది పునరావృతమయ్యే కార్యక్రమంగా దీన్ని రూపొందించారు. ఇది 2023లో ప్రారంభ తేదీలో 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ పూర్తి సమయం అండర్ గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్/ డాక్టరేట్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లే లేదా ఇప్పటికే చేరుకున్న అంతర్జాతీయ విద్యార్థులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ఆర్థిక సహాయమే కాకుండా, జోల్వ్ గ్లోబల్ స్కాలర్లు జోల్వ్లో సీనియర్ల బృందం నుంచి మద్దతు, మార్గదర్శకత్వం పొందుతారు. వారి సంబంధిత రంగాలకు అనుగుణంగా మార్గదర్శకత్వాన్ని పొందుతారు. ఇంకా, స్కాలర్షిప్లు కేవలం ట్యూషన్ ఫీజులకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు.













