వరంగల్ లో అమెరికా ఐటీ కంపెనీ
సొంతూరిపై ప్రేమతో కంపెనీని ఏర్పాటు చేసిన వంశీరెడ్డి
ఓరుగల్లుకు చెందిన వంశీరెడ్డి అమెరికాలో క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఐటీ కంపెనీని ఏర్పాటు చేయడంతోపాటు ఎంతోమందికి ఉపాధి లభించేలా దానిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నాలుగు చోట్ల, కెనడా, బెంగళూరు, హైదరాబాద్‌లో క్వాడ్రంట్ కంపెనీ విస్తరించింది. దాదాపు రెండువేల మంది ఉద్యోగులు క్వాడ్రంట్లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ, ప్రోత్సాహంతో సొంతూరిపై ప్రేమతో ఓరుగల్లులోని మడికొండలో క్వాడ్రంట్ కంపెనీ క్యాంపస్‌ను వంశీరెడ్డి ఏర్పాటు చేశారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే లక్ష్యంతో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశామని, దాదాపు 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
నర్సంపేట దగ్గరిలోని మగ్దుంపురం గ్రామానికి చెందిన వంశీరెడ్డి తండ్రి మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశాఖలో డైటీషియన్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. అమ్మ మణిమాల గ•హిణి. తమ్ముడు సాయి క•ష్ణారెడ్డి, చెల్లెలు హిమబిందు కూడా అమెరికాలోనే స్థిరపడ్డారు. వంశీరెడ్డి భార్య సుస్మితా రెడ్డి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన వంశీరెడ్డి తొలుత హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేశారు. తన లక్ష్యసాధనకు వీలుగా పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కంపెనీని ఏర్పాటు చేయాలన్న కోరికతో ఐటీ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2012లో క్వాడ్రంట్ పేరుతో స్టార్టప్ కంపెనీని ఆయన ప్రారంభించారు. మంచి లాభాలు రావడంతో అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు కంపెనీని ఆయన విస్తరించారు. తరువాత కెనడా, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా క్వాడ్రంట్ కంపెనీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. దాదాపు రెండువేల మంది ఉద్యోగులు ప్రస్తుతం క్వాడ్రంట్లో పనిచేస్తున్నారు. ఇపుడు మడికొండలో రూ.10కోట్లతో క్వాడ్రంట్ క్యాంపస్‌ను ఆయన ఏర్పాటు చేస్తున్నారు.
ఫిబ్రవరి 15న మడికొండలోని టీఎస్ఐఐసీకి చెందిన ఐటీ పార్కులో ఈ క్యాంపస్‌కు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతితోపాటు అతిథులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్వాడ్రంట్ ఐటీ కంపెనీ సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రముఖ ఐటీ కంపెనీలు సైయెంట్, టెక్ మహీంద్ర కంపెనీలు వరంగల్‌కు వచ్చాయని చెప్పారు. వంశీరెడ్డి మాట్లాడుతూ, సొంతూరిపై ప్రేమతోనే ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 500 మందికి ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా ఉపాధి లభిస్తుందని తెలిపారు.













