శాట్ ప్రిపరేషన్స్ కోసం 24 గంటల తరగతులు ప్రారంభించిన తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఎస్ఏటీ (శాట్) శిక్షణా తరగతులు ప్రారంభించనుంది. విద్యార్థులకు ఈ తరగతులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. శాట్ పరీక్షల కోసం పిల్లలను సిద్ధం చేయడం కోసం రెండు అసెస్‌మెంట్ టెస్టులు, రెండు ఫుల్ ప్రాక్టీస్ టెస్టులు ఈ తరగతుల్లో భాగంగా ఉంటాయని తానా ప్రతినిధులు తెలిపారు. శాట్, ఏసీటీ పరీక్షల్లో అత్యుత్తమ స్కోరు సాధించిన టాపర్లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఈ తరగతులు నిర్వహిస్తారు. వీరిలో టెస్ట్ ప్రెప్ పండిట్స్ సీఈవో, వ్యవస్థాపకులు అన్వర్, ఏసీటీ పర్‌ఫెక్ట్ స్కోరర్ రాయ్ ఝూ, శాట్ టాప్ స్కోరర్ కిమీర పాలడుగు తదితరులు ఉన్నారు. నవంబరు 29, మంగళవారం నాడు ఈ తరగతులు ప్రారంభమవుతాయి. వీటిని వినేందుకు రిజిస్ట్రేషన్ రుసుముగా 75 డాలర్లు చెల్లించాలి. ఈ నగదు మొత్తం తానా ఛారిటీకి అందుతాయి. విద్యార్థులంతా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని తానా కోరింది.