అమెరికాలో భారీ హిమపాతం
అమెరికాలో హిమపాతం అధికంగా ఉంది. మంచు బాగా కురవడంతో ప్రజలు రోడ్లపైకీ వెళ్లలేకపోతున్నారు. సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ కూడా మూతపడింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ది కింగ్ కౌంటీ మెట్రో రవాణా సేవలు మంగళవారం వరకు తక్కువ దూరాలు తిరుగుతాయి. మంచు తొలగించిన మార్గాల్లో మాత్రమే రోడ్లపై రవాణా సేవలు అందించనుంది. సియాటిల్ మైనోరైల్ వాతావరణ పరిస్థితులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అమెరికాలో సిలికాన్ సిటీగా పేరొందిన సియాటిల్ నగరం గత 70 ఏండ్లలో ఫిబ్రవరి నెలలో ఎన్నడూ చూడనంత హిమపాతాన్ని చూస్తోంది.













