బే ఏరియాలో రజనీకాంత్ కాకర్లకు సన్మానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నార్తర్న్ కాలిఫోర్నియా రీజినల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించిన రజినీకాంత్ కాకర్లను తానా సభ్యులు, బే ఏరియా ప్రవాసులు మిల్పిటాస్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కాకర్లకు తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తానా సభ్యులందరితో కలిసి పనిచేయాలని సూచించారు. స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనాలని చెప్పిన జయరాం కోమటి.. ధీటైన నాయకత్వ లక్షణాలతో పైస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం రజినీకాంత్ కాకర్ల మాట్లాడుతూ తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలియజేశారు. సంఘం బలోపేతానికి క్రియాశీలంగా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. ఇందుకు సభ్యులు తమ విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయరాం కోమటి, భక్త బల్ల, సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, యశ్వంత్ కుడరవల్లి, శ్రీనివాస్ వల్లూరిపల్లి, శ్రీకాంత్ దొడ్డపనేని, రమన్ సంచుల, వీరబాబు ప్రత్తిపాటి, గోకుల్ రుచిరాజు, రామ్ తోట, భరత్ ముప్పిరాల, చంద్ర గుబ్టుపల్లి, శ్రీనివాస వీరపనేని, కోనేరు శ్రీకాంత్, సుబ్బ యంత్ర తదితరులు పాల్గొన్నారు.













