తానా సేవలను ప్రశంసించిన పివి. సింధు
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు అన్నారు. భారత ఆర్మీ సంక్షేమం కోసం తానా ఒహాయోలో మార్చి 2వ తేదీన నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు మద్దతుగా తాను సంతకం చేసిన టీ షర్టులను ఆమె తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుకు అందజేశారు. అమెరికాలోని తెలుగు సంఘాలకు మీడియాపరంగా గత 16 ఏళ్ళుగా తెలుగుటైమ్స్ చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా చెన్నూరి వెంకట సుబ్బారావు ఆమెకు వివరించారు. అమెరికాలో మొట్టమొదటి తొలి తెలుగు పత్రిక ఇదేనని ఆయన చెప్పారు. తెలుగుటైమ్స్ 16వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు టైమ్స్ పాఠకులకు కూడా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.













