అక్కినేని ఫౌండేషన్ గుర్తింపు రద్దు – వివరణ
ఇటీవల కేంద్ర ప్రభుత్వం గుర్తింపు రద్దు చేసిన ఎన్ జి ఓ సంస్థల్లో అక్కినేని ఫౌండేషన్ సంస్థ కూడా ఉన్నట్లు తెలియజేస్తూ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా లోగో ను పొరపాటుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వాడటం జరిగింది.
“అక్కినేని ఫౌండేషన్” చాలా కాలం క్రితం నాగేశ్వర రావు గారు భారతదేశంలో స్థాపించిన ఎన్ జి ఓ సంస్థ అని, అది అక్కినేని కుటుంబానికి చెందినదని, “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” సంస్థ (ఏఎఫ్ఏ) ఏఎన్ఆర్ అభిమానులు కొంతమంది కలిసి అమెరికాలో ఆయన మరణానంతరం 2014 లో స్థాపించిన సంస్థ అని, ఈ రెండింటికి సంబంధం లేదని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
అమెరికాలో స్థాపించబడ్డ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు భారత ప్రభుత్వ నిబంధనలు వర్తించవని ప్రసాద్ తోటకూర వివరించారు. మిగిలిన వివరాలకు www.akkinenifoundationofamerica.org ను సందర్శించవచ్చు.













