మోదీ ప్రసంగంపై.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుల
యూఎస్ కాంగ్రెస్ను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. ఇండో యూఎస్ బంధం అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ప్రజాస్వామ్య విలువలను మరింతగా పరిరక్షించడానికి మనం అంతా కలసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ సభ్యులు పిలుపునిచ్చారు. ప్రసంగాన్ని ప్రశంసించిన వారిలో కాంగ్రెస్ సభ్యులు సేథ్ మ్యాగజైనెర్, ఫ్రెంచ్ హిల్, మైక్ లాలెర్, డాన్ బకోన్, ప్రతినిధులు నికోల్ మల్లియో టాకిస్, మారియన్నెట్టె మిల్లెర్ మీక్స్, మార్క్ వియెసే. జాన్ డ్యూర్టే, కొలిన్ అల్రెడ్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు మోదీ.













