ఈ నెల 21 నుంచి అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన గతంలో అమెరికా వెళ్లినా, ఈసారి ఆ దేశ అధ్యక్షుడి ప్రత్యేక ఆహ్వానంపై తొలిసారిగా అధికార పర్యటన జరపునున్నారు. గడిచిన 75 ఏళ్లలో అమెరికాకు అధికార పర్యటన జరిపిన భారతీయ నాయకులు ఇద్దరే ఇదదరు. ఒకరు పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1863)లో, మరొకరు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (2009లో). అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ జూన్ 22న శ్వేతసౌధంలో మోదీకి అధికార విందు ఇస్తారు. జూన్ 23న మోదీ అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభలను ఉద్దేశించి రెండోసారి ప్రసంగించనున్నారు. అంతకుముందు 2016 యాత్రలో తొలి ప్రసంగం ఇచ్చారు. ఇప్పటి వరకూ విదేశాల నుంచి ఇజ్రాయెల్, బ్రిటన్ ( చర్చిల్), దక్షిణాఫ్రికా ( నెల్సన్ మండేలా) నాయకులు మాత్రమే ఇలా రెండు సార్లు కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించారు.













