మోడీ రాక కోసం వేచి చూస్తున్న ట్రంప్
ఈ నెల 26న భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా వేచి చూస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. భారత్తో ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా పలు కీలకాంశాలపై వీరు చర్చలు సాగించనున్నారని ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ పేర్కొన్నారు. రెండు దేశాల సంయుక్త ప్రయోజనాలను కాపాడుకునే లక్ష్యంతో చర్చలు సాగుతాయని, ఉగ్రవాదంపై పోరాటం, ఆర్థిక అభివృద్ధి సహకారం, సంస్కరణల అమలు, భద్రతా పరమైన అంశాల్లో మరింత సాయం, ఇండో -పసిఫిక్ రీజియన్లో సహకారం వంటి అంశాలపై భారత ప్రధానితో అధ్యక్షుడు మాట్లాడనున్నారని తెలిపారు. రెండు దేశాల్లోని 160 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ధిని పొందేలా చూడడమే ట్రంప్ ఉద్దేశమని పేర్కొన్నారు.













