వైదొలగిన మరో పెంటగాన్ అధికారి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచిత నిర్ణయాల పట్ల అసంతృప్తితో రక్షణశాఖ మరో కీలక అధికారి వైదొలిగారు. ట్రంప్ నిర్ణయాల పట్ల అసంతృప్తితోనే రాజీనామా చేసినట్టు చీఫ్ ఆఫ్ స్టాఫ్ కెవిన్ స్వీని తెలిపారు. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడి లేదని మీడియాతో చెప్పారు. స్వీని సహా ఇప్పటికే ముగ్గురు పెంటగాన్ అధికారులు తమ పదవుల నుంచి వైదొలిగారు. సిరియాలోని యూఎస్ బలగాలకు రెండేండ్ల పాటు స్వీని నేతృత్వం వహించారు. ఐఎస్ దాడులను సమర్థవంతంగా తిప్పిగొట్టగలిగే సామర్థ్యం స్వీని సొంతం. సిరియాలోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వీని రాజీనామా అంశం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.













