త్వరలో పాక్ ప్రధాని అమెరికా పర్యటన
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని ఖురేషి.. జూన్‌లోనే ఇమ్రాన్ అమెరికా పర్యటన ఖరారైంది. కానీ దేశీయ కార్యక్రమాలు, 2019 బడ్జెట్ కారణంగా వాయిదా పడిందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఇమ్రాన్‌ఖాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నరని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతీయ సమస్యలపై చర్చల కోసం ట్రంప్ ఆహ్వానం మేరకు ఇమ్రాన్ వాషింగ్టన్ వెళ్తున్నారని ఖురేషి తెలిపారు. ట్రంప్ హయాంలో సమావేశం కానుండడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం జులై 20న ఇమ్రాన్‌ఖాన్ అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. వీరిద్దరి సమావేశం కోసం కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.













