సిఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళమిచ్చిన పైళ్ళ మల్లారెడ్డి
కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు కోటి నూటపదహారు రూపాయలను ఎన్నారై ప్రముఖుడు, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) వ్యవస్థాపకుడు పైళ్ళ మల్లారెడ్డి విరాళంగా ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన ఆయన ఈమేరకు విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళాల చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి ప్రగతి భవన్ లో పైళ్ళ మల్లారెడ్డి ప్రతినిధి అందచేశారు. ఈ కష్టకాలంలో సహాయపడటానికి ముందుకు వచ్చిన ఎన్నారైలను మంత్రులు అభినందించారు.













