ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ వారి ఆద్వర్యం లో తెలంగాణా విమోచన దినం
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్బంగా న్యూజెర్సీ రాష్ట్రం, నార్త్ బృన్స్విక్ లోని మిర్చి రెస్టారెంట్ లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా విచ్చేసిన ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలంగాణ స్వాతంత్ర ఉద్యమములో పోరాడిన వీరులకు నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని అఫ్-బీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేసారు.
తెలంగాణా సభికులందరికీ ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల స్వాగతం తెలుపుతూ ప్రారంబించారు.
ఈ కార్యక్రమములో ప్రత్యేకముగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు ఆన్ లైన్ మాట్లాడుతూ అమెరికాలో ప్రవాస తెలంగాణ వారు అఫ్ బీజేపీ ఆధ్వర్యములో ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని అభినందించారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యదర్శి శరత్ వేముల మాట్లాడుతూ
నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది నిజం.. సైనిక చర్య ద్వారా భారత దేశంలో విలీనం అయింది వాస్తవం.. మరి ఈ నిజం, వాస్తవం అంగీకరించేందుకు ఎందుకు భయం? సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ఎందుకీ నీలి నీడలు?.. సమైక్య రాష్ట్రంలో ఇదే తంతు.. స్వరాష్ట్రంలోనూ అదే విధానమా? హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ భాగం కావడం అబద్దమా?.. ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటం తప్పా?.. రాజకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందార్ల అరాచకాలు నిజం కాదా? అని ప్రశ్నించారు.
రజాకార్లకు(ఖాసీం రజ్వి) వారసులైన ఒవైసి కుటుంబాన్ని తలకెత్తుకుని తెలంగాణ ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్న కెసిఆర్ తీరుపై టీడీఫ్ మాజీ అధ్యక్షులు మరియు ప్రస్తుత బీజేపీ లోకి వచ్చిన ఏనుగు లక్ష్మణ్ రెడ్డి మండిపడ్డారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ మరో 13 నెలల పాటు చీకటి రోజులు గడిపిందని రఘువీర్ రెడ్డి అన్నారు.
విజయ్ కుందూరు మాట్లాడుతూ, నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్ విస్మరిం చారని పేర్కొన్నారు.
బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ తెలంగాణకు అసలు చరిత్రే లేకుండా చేస్తున్నారన్నారు. తెలంగాణ కీర్తిని, తెలంగాణ చరిత్ర ని ముందు తరాలకి తెలియచేస్తాం అని ప్రతిజ్ఞ చేయించారు శ్రీకాంత్ తుమ్మల.
న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు కేసీఆర్.. మరి మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత, ఆయనే అధికారంలో ఉన్నాక సెప్టెంబర్ 17 వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదు?
లింగాల సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్యహించాలని డిమాండ్ చేసారు. తెలంగాణ లో బీజేపీని శక్తివంతంగా చేయడానికి కృషి చేస్తాం అన్నారు.
డా!! మోహన్ రెడ్డి, రవీందర్ పాడూరు మరియు గోపి సముద్రాల మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా.. వీరుల త్యాగాలను మజ్లిస్ పార్టీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. దీనిని తెలంగాణ ప్రజలు మరిచిపోరని, ఈ అవకాశవాద రాజకీయాలకు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200కిపైగా బలిదానాలు చేసుకుంటే.. 400 మంది మాత్రమే అని పేర్కొనడం బాధాకరమన్నారు.
ఈరోజు నిజంగా అరుదైన రోజు.. హైదరాబాద్ విమోచన దినం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీనే వచ్చాయి అని వంశీ యంజాల, విజేందర్, ప్రకాష్ తెలిపారు.
ఈ కార్యక్రమములో మోడీ గారి జన్మదిన సందర్భముగా బర్త్డే కేక్ కట్ చేసి, జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా-కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల, ఓఎఫ్ బిజెపీ న్యూజెర్సీ యువ కన్వీనర్ శ్రీకాంత్ తుమ్మల, డా!! మోహన్ రెడ్డి, రవీందర్ పాడూరు, రఘువీర్ రెడ్డి, గోపి సముద్రాల, విజయ్ కుందూరు, లింగాల సంతోష్, వంశీ యంజాల, విజేందర్, ప్రకాష్, శరత్ వేముల, న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ఏనుగు లక్ష్మణ్ రెడ్డి, అశ్విన్, ప్రదీప్ కట్ట, రామ్మోహన్ ఎల్లంపల్లి, ఇంకా గుజరాత్ నుండి పలువురు పాల్గొన్నారు.













