డొనాల్డ్ ట్రంప్ పాలనపై ఒబామా విమర్శలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయలేకపోయారని, ఎందుకంటే అది ఆయన వల్ల కాని విషయమని మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా విమర్శించారు. డెమోక్రటిక్ జాతీయ సదస్సులో భాగంగా ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడని తెలిపారు. అమెరికా మంచి కోసం గతంలో తన హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన జో బైడెన్‌కు అమెరికన్లు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల పాలనలో అధ్యక్ష కార్యాలయం కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించడంపై ట్రంప్‌నకు ఏనాడూ ధ్యాస లేదని అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఏవిధమైన ప్రయత్నం చేయలేదని ఒబామా దుయ్యబట్టారు. తన పదవికి ఉన్న అపరిమితమైన అధికారాలు ప్రజల బాగోగుల కోసం కాకుండా కేవలం తన కోసం, తనవారి కోసం మాత్రమే ట్రంప్ వినియోగించారని విమర్శంచారు.
అధ్యక్ష స్థానాన్ని ఇంకో రియాల్టీ షోగా చూపడం మినహా ఏపీ చేయలేకపోయారని ఒబామా ధ్వజమెత్తారు. ట్రంప్ చేతకానితనం కారణంగా వ్వవస్థలన్నీ అస్తవ్యస్తమై అమెరికన్లు తీవ్ర విపరిణామాలు ఎదుర్కొన్నారని అన్నారు. కరోనా విషయంలో ట్రంప్ వైఫల్యం కారణంగా 1.70 లక్షల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల నుంచి అమెరికన్లు బయట పడేయగలిగే శక్తి కేవలం జో బైడెన్‌కు మాత్రే ఉందని ఒబామా పేర్కొన్నారు.













