భద్రత దుస్తుల కొరత…అమెరికాలో నర్సుల ఆందోళన
కోవిడ్19 నుంచి రక్షణ పొందేందుకు ప్రొటెక్టివ్ సూట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు కూడా వైరస్ సోకుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నామని అమెరికాలో వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా సూట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, గౌన్లు, కంటి అద్దాల కొరత ఉన్నట్లు వారు తెలిపారు. డాక్టర్లకు కూడా కావాల్సినన్ని ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేదంటున్నారు. పాత మాస్క్‌లను రిసైకిల్ చేసి వాడుతున్నట్లు వారు చెబుతున్నారు. తమను తాము రక్షించేందుకు ట్రాష్ బ్యాగ్‌లను శరీరంపై కప్పుకుంటున్నట్లు చెప్పారు.
కోవిడ్19 పేషెంట్లకు వైద్య చికిత్సలు అందించాలంటే.. అనేక వైద్య పరికరాలు అవసరమని అంటూ, ఒకవేళ సరైన ప్రొటెక్టివ్ ఈక్విప్మెంట్ లేకుంటే.. వైరస్ అందరికీ వ్యాపిస్తుందని నర్సుల యూనియన్ హెడ్ బొన్నీ కాస్టిల్లో తెలిపారు. గత కొన్ని నెలల నుంచి తాము ఈ డిమాండ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. కోవిడ్19 రోగుల చికిత్సలో నర్సులే కీలక పాత్ర పోషించనున్నారు. వారిపైనే రోగుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. నర్సులకు అనేక మంది సంఘీభావం తెలిపారు. వ్యక్తిగత సూట్లు లేనంత వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టమే అని నర్సులు అంటున్నారు.













