ఏపీలో 10 వేల పేద కుటుంబాలకు ఎన్నారై తెదేపా సాయం
మహానాడులో భాగమైన ఎన్నారై టీడీపీ. జన్మభూమి రుణం తీర్చుకున్న ఎన్నారైలు. నందమూరి తారకరామారావు 97వజయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 25 ముఖ్య నగరాల్లో పదివేల మంది నిరుపేద బ్రాహ్మణ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బిసికుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, విజయవాడలో గద్దె రామ్మోహన్, బోండా ఉమా, విజయనగరంలో అశోక్‌గజపతిరాజు, నందిగామలో తంగిరాల సౌమ్య, తణుకులో ఆరుమిల్లి రాధాకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, పెదకాకానిలో దూళిపాళ నరేంద్ర, అమరావతి, గుంటూరులో కోవెలమూడి నాని, ఉప్పుటూరి సీతామహాలక్ష్మీ, దొడ్డపనేని రాజేంద్ర, మాడుగు శ్రీకాకుళంలో పైలా ప్రసాద్మరియు తిరుపతి, నెల్లూరు, ప్రత్తిపాడు, ఒంగోలు, పర్చూరు, మదనపల్లి, అధోని, శింగనమల, రాజంపేట, ప్రొద్దుటూరు, అద్దంకి, రాజాం, నర్సీపట్నం లో టీడీపీ ఇంచార్జుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.













