ప్రవాస భారతీయులపై ఆ పన్ను లేదు
బడ్జెట్ సందర్భంగా ఆదాయ పన్ను విషయమై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ప్రవాస భారతీయుల్లో అయోమయం ఏర్పడింది. అయితే దీనిపై నిర్మలా సీతారామన్ సృష్టతనిచ్చారు. ప్రవాస భారతీయులు కేవలం భారత్లో ఆర్జించే సంపాదనకు మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుందనీ, ఇతర దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. బడ్జెట్లో ప్రవేశపెట్టి కొత్త పన్ను విధానంపై అధికారులు అయోమయానికి గురికావొద్దని ఆమె కోరారు. ఎన్ఆర్ఐలు ఇతరదేశాల్లో ఆదాయం పొందవచ్చు. కానీ వారికి ఇక్కడ ఉండే ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను తీసుకునేందుకు మాత్రం తమకు హక్కు ఉందని అన్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో జారీ చేసింది. ఎన్ఆర్ఐలు స్వదేశంలోని వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం పొందితే పన్ను విధిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. అవసరమైతే ఈ నిబంధనను చట్టంలో చేరుస్తామని చెప్పారు.













