శివారెడ్డిగూడెం గ్రామంలో ఐర్లాండ్ NRI ఉచిత వైద్య సేవ – 5th YEAR
ఐర్లాండ్ లో నివశిస్తున్న మా శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన NRI మేకల ప్రభోద్ రెడ్డి మా గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా ఉచిత కార్పొరేట్ వైద్యం అందించటానికి కావలసిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం చేయడానికి సన్ రైజ్ హాస్పిటల్ Hyderebad వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తున్నారు.
సంక్రాంతి సమయంలో నాట్లు వేసిన రైతులు కీళ్ల నొప్పులతో, చలి జ్యరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతారు. మొండి ధైర్యంతో కొందరు, ఆర్ధిక స్థోమత లేక మరికొందరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్యం చేస్తారు. ఈ సమస్యకు ఒక పరిస్కారం చూపాలని మా గ్రామానికి ఏదైనా మంచి పని చేయాలనే తపనతో మా గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఐర్లాండ్లో నివాసం ఉంటున్న ప్రభోద్ రెడ్డి అన్నను సంప్రదించినప్పుడు, మాకు సహాయం చేస్తానని ముందుకువొచ్చి, ప్రతి సంవత్సరం మా గ్రామానికి ఉచిత వైద్య సేవకు కావలసిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నాడు.
ముందుగా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.00 గo నుండి సాయంత్రం 4.00 గo వరకు నిర్వహించాము.
సుమారు 300 మంది గ్రామ ప్రజలకు ఈ ఉచిత వైద్య సేవ శిభిరం ధ్వారా వైద్యం అందింది. ఈ సందర్భంగా శివారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ పీసర్ల మంజుల, పీసర్ల మహిపాల్ రెడ్డి మరియు శివారెడ్డిగూడెం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పీసర్ల రామకృష్ణ రెడ్డి ఆర్ధిక సహాయం అందించిన మేకల ప్రభోద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భంగా మేకల ప్రబోధ్ రెడ్డి గారి తల్లి తండ్రులను మరియు సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లను శివారెడ్డిగూడెం వెల్ఫేర్ సొసైటీ వారు ఘనంగా సత్కరించారు.
ఈ ఆరోగ్య శిభిరం ఏర్పాటులో సహకరించిన టీం సభ్యులు :
పీసర్ల రామకృష్ణ రెడ్డి, నర్సింహారెడ్డి, రవీందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాజశేఖరరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మేకల జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, మూడుపూరు జంగారెడ్డి, అంగిటి మల్లారెడ్డి, వారాల జంగారెడ్డి, మొద్దు బస్వారెడ్డి, చిలుముల వెంకట్ రెడ్డి, చిలుముల శేఖర్ రెడ్డి, వారాల శ్రీనివాస్ రెడ్డి, భగవంత రెడ్డి, విష్ణు, సంతోష్, ప్రశాంత్, మధుసూధన్, శివ శంకర్, రాజశేఖర్, శివ, ధనంజయ వెంకట్ రెడ్డి తదితరులు.













