‘ద న్యూయార్క్ టైమ్స్’, ‘న్యూయార్కర్’ లకు పులిట్జర్ పురస్కారం
ది న్యూయార్క్ టైమ్స్, ది న్యూయార్కర్ పత్రికలకు జర్నలిజంలో సంయుక్తంగా ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతి దక్కింది. ఈ పత్రికలు తమ కథనాల ద్వారా హాలీవుడ్ దర్శకుడు హార్వే వీన్స్టెన్ లైంగిక వేధింపుల ఉదంతాన్ని వెలుగులోకి తేవడంతో గతేడాది సినీ పరిశ్రమలో ప్రకంపనలు వచ్చాయి. సంగీత విభాగంలో 30 ఏళ్ల పాప్ గాయకుడు కెండ్రిక్ లామర్ రూపొందించిన ఆల్బమ్ డామ్న్కు ఈ పురస్కారం దక్కింది. పులిట్జర్ ప్రైజ్ పొందిన తొలి పాప్ గాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. సాహిత్యంలో ఆండ్రూ సీన్ గ్రీర్ తన కాల్పినిక నవల లెస్ కు పులిట్జర్ను సొంతం చేసుకున్నారు. లెటర్స్ అండ్ డ్రామా విభాగంలో కారోలిన్ ఫ్రేజర్ రాసిన ఫైర్స్ అనే బయోగ్రఫీ, మార్టిన్ మజోక్ నాటకం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాయి.













