కొత్త వీసా రూల్స్… 2 లక్షల మందిపై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలు అమెరికాలో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది భారత విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణపై సందిగ్ధతను తీసుకొచ్చిందని అమెరికాలోని భారత ఎంబసీ కార్యాలయం పేర్కొంది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ పోగ్రామ్ (ఎస్ఈవీపీ) తాజా నివేదిక ప్రకారం.. గత జనవరిలో అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో 1,94,556 మంది భారతీయ విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో 1,26,132 మంది పురుషులు ఉండగా, 68,405 మంది మహిళలు ఉన్నారు. మిగతావారు ట్రాన్స్జెండర్లు. తాజా వీసా నిబంధనలతో వీరిపై ప్రభావం పడనున్నది.













