చైనాలో మరో కొత్త వైరస్
ఒకవైపు కొవిడ్-19 నుంచి చావుదప్పి కన్ను లొట్టబోయిన చందంగా బయట పడుతున్న చైనాను.. మరో కొత్త వైరస్ పట్టుకొన్నది. హంటా వైరస్ మరోసారి ప్రబలుతుండటంతో ఆ దేశం కలవరపడుతున్నది. ఈ వైరస్ బారినపడిన ఒకరు చనిపోయినట్టు చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. యున్నాన్ ప్రావిన్స్ నుంచి చార్టర్డ్ బస్సులో షాన్డోగ్ ప్రావిన్స్ వెళ్తుండగా ఆ వ్యక్తి చనిపోయినట్టు తెలిపింది. మృతుడికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుపగా హంటా వైరస్ సోకినట్టు తేలిందని, బస్సులోని 32 మందికి కూడా హంటా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్టు ట్విట్టర్లో గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది.













