అమెరికాలో మోదీ పర్యటనకు గుర్తుగా… థాలీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ప్రత్యేకంగా మార్చేలా ప్రవాస భారతీయులు వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. న్యూజెర్సీ లోని ఓ భారతీయ రెస్టారెంట్ మోదీ పర్యటనకు గుర్తుగా ప్రత్యేక థాలీని సిద్ధం చేసిది. మోదీజీ థాలీ గా దానికి నామకరణం చేసింది. ఇందులో కిచిడీ, రసగుల్లా, సర్సో దా సాగ్, ఆలూ, కశ్మీరీ ఆలూ, ధోక్లా, చాచ్, పాపడ్ వంటివి ఉన్నాయి. ఈ థాలీని రెస్టారెంట్ యజమాని శ్రీపాద్ కులకర్ణి స్వయంగా సిద్ధం చేశారు. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో థాలీలో వాటికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. త్రివర్ణ పతాకంలో ఉండే మూడు రంగుల్లో ఇడ్లీలను తయారు చేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌కు అంకింతమిస్తూ ఆయన పేరు మీద మరో థాలీని సిద్దం చేస్తామని శ్రీపాద్ కులకర్ణి తెలిపారు.













