క్షణాల్లో మొబైల్ చార్జింగ్!
మొబైల్కు చార్జింగ్ పెట్టగానే పుల్ అయిపోయే సరికొత్త బ్యాటరీని అమెరికాకు చెందిన కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. సంప్రదాయబద్ధ బ్యాటరీలకు భిన్నంగా 3డీ గైరోడియల్ స్ట్రక్చర్లో రూపొందించిన ఈ బ్యాటరీలు, సెకన్లలోనే చార్జింగ్ అవుతాయని తెలిపారు. ఇందుకోసం అన్ని బ్యాటరీల్లో మాదిరిగా ఆనోడ్, కాథోడ్లను వాడలేదట. బ్యాటరీలోని చిన్న చిన్న భాగాలతోనే చార్జింగ్ అవుతుందట. అంతేకాకుండా 3డీ గైరోడియల్ నిర్మాణం వల్ల అవుతుందట. అంతేకాకుండా 3డీ గైరోడియల్ నిర్మాణం వల్ల అవసర శక్తి వృథాను బ్యాటరీలు నిరోధిస్తాయని పరిశోధకులు తెలిపారు.













