NATS: నందమూరి బాలకృష్ణకు ‘జీవితసాఫల్య పురస్కారం’ అందించిన నాట్స్
అమెరికాలోని టాంపా బే వేదికగా జరిగిన నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ను ‘జీవితసాఫల్య పురస్కారం’ అందజేశారు. తన సినీప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లు అందుకున్న బాలకృష్ణ, హిందూపురం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ వారసుడిని కొనసాగిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ గుర్తుచేసిన నాట్స్.. బాలకృష్ణను ఘనంగా సత్కరించి, అవార్డు అందజేసింది. తెలుగు వారికి ఎంతో సేవ చేసిన ఆయన్ను సత్కరించుకోవడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని నాట్స్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా 8వ తెలుగు సంబరాలు జరుపుకుంటున్న నాట్స్‌కు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్‌పై రాసిన పుస్తకాలను ఆవిష్కరించే అవకాశం దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలుగు చరిత్రను గుర్తుచేసిన ఆయన.. అమెరికాలో తెలుగు వారి ఖ్యాతి చూసి ఆంధ్రరాష్ట్రంలో కూడా అందరూ సంతోషిస్తున్నారని చెప్పారు. గంభీరమైన కంఠంతో ఆయన చెప్పిన కవితలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.







