నాట్స్ నేతృత్వంలో ఉచితంగా యోగా క్లాసులు

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) నేతృత్వంలో ప్రతి ఆదివారం యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు. కమ్యూనిటీలోని సభ్యులకు ఆయురారోగ్యాలు కలగాలనే సంకల్పంతోనే నాట్స్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫైడ్ ఇన్‌స్ట్రక్టర్, యోగిక్ సైన్సెస్‌లో ఎంఏ పట్టా పొందిన శ్రీ మైత్రేయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ప్రతి ఆదివారం ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ క్లాసుల్లో పాల్గొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకపోవడం గమనార్హం. ఈ క్లాసుల్లో పాల్గొనడం కోసం అనుకునే వారు www.natsworld.org/nats-yoga లింకులో రిజిస్టర్ చేసుకోవచ్చు.