నాట్స్, ఆయుష్ హాస్పిటల్ ఏలూరు వారి ఆధ్వర్యంలో జూలై 7న మెగా వైద్య శిబిరం

నాట్స్, ఏలూరు హేలాపురి రూరల్ లయన్స్ క్లబ్ మరియు ఆయుష్ హాస్పిటల్ ఏలూరుతో కలిసి జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. వట్లూరు గ్రామ చుట్టుపక్కల ప్రజలకు బీపీ, షుగర్, కళ్లు, ఈసీజీ పరీక్షలు చేయనున్నారు. ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేస్తామన్నారు.