NATS: హిందూ టెంపుల్‌లో కొత్త భవనం కోసం నాట్స్ దోశ క్యాంప్

ఈస్టర్న్ అయోవా హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ కొత్త భవనం కోసం నిధులు సేకరించడానికి, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) అయోవా బృందం “దోశ క్యాంప్”ను (Dosa Camp) ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 20 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దేవాలయంలో జరగనుంది. ఈ ఫండ్ రైజర్‌లో దోస, ఇడ్లీ, ఉప్మా-పెసరట్టు వంటి సంప్రదాయ వంటకాలు $1 నుండి $10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ (Dosa Camp) అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని దేవాలయంలో భవన నిర్మాణానికి వినియోగిస్తారు. వంటలకు సంబంధించిన పదార్థాలు, సామాగ్రి, వాలంటీర్ సేవలు అన్నింటినీ నాట్స్ అయోవా (NATS IOWA) బృందం అందిస్తుంది.
ఈ కార్యక్రమానికి నాట్స్ (NATS) ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి నేతృత్వం వహిస్తున్నారు. అయోవా బృందంలో శివ ఆర్. గోపాలం, కృష్ణ అకురతి, నవీన్ ఇంటూరి, జగదీష్ బాబు బొగ్గరపు, గిరీష్ కంచర్ల, డా. విజయ్ గోగినేని, శ్రీని కట్రగడ్డ, డా. స్మిత కుర్రా, శ్రీని వనవాసం, సింధు మన్వాడి ఉన్నారు. అడ్వైజరీ బృందంలో జ్యోతి అకురతి, కళ్యాణి గోపాలం, హొన్ను దొడ్డమానే ఉన్నారు. విరాళాలను ఆన్‌లైన్ ద్వారా కూడా అందించవచ్చు. టెంపుల్ వెబ్‌సైట్ https://iowahindutemple.org/ లేదా గోఫండ్‌మీ పేజ్ https://gofund.me/6a19bee2 లో కూడా విరాళాలు అందించవచ్చని నాట్స్ తెలిపింది.