భారత కుబేరుల్లో మళ్లీ ముకేశ్ అంబానీ అగ్రస్థానం
దేశంలో అత్యంత శ్రీమంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 36.8 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బస్ ఇండియా బిలియనీర్ల జాబితా 2020లో అగ్రస్థానంలో నిలిచారు. అవెన్యూ సూపర్మార్టస్ (డీ- మార్ట్) అధిపతి రాధాకిషన్ దమానీ రెండో స్థానం పొందారు. ఈయన సంపద 13.8 బిలియన్ డాలర్లు. హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (11.9 బిలియన్ డాలర్లు)కు మూడో ర్యాంకు లభించగా, ఆ తర్వాతి స్థానాల్లో ఉదయ్ కొటక్ (10.4 బిలియన్ డాలర్లు), గౌతమ్ ఆదానీ (8.9 బిలియన్ డాలర్లు), సునీల్ మిత్తల్ (8.8 బిలియన్ డాలర్లు), సైరస్ పూనావాలా (8.2 బిలియన్ డాలర్లు), కుమార్ మంగళం బిర్లా (7.6 బిలియన్ డాలర్లు), లక్ష్మీ మిత్తల్ (7.4 బిలియన్ డాలర్లు), అజీమ్ ప్రేమ్జీ, దిలీప్ సంఘ్వీ (6.1 బిలియన్ డాలర్లు) లు తొలి స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.













