అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పులు
అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పులు జరిగాయి. సంగారెడ్డికి చెందిన ముబిన్ అహ్మద్ (26)పై కాలిఫోర్నియాలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డికి చెందిన ముజీబ్ అహ్మద్ వైమానిక దళంలో పనిచేస్తున్నారు. ఉద్యోగ నిమిత్తం కుటుంబంతోపాటు హైదరాబాద్‌కు వచ్చి మాసాబ్‌ట్యాంక్ గార్డెన్టవర్లో నివాసం ఉంటున్నార. ముజీబ్ కుమారుడు ముబిన్ అహ్మద్ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం 2015 ఫిబ్రవరిలో అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ స్టోర్‌లో పని చేస్తున్నాడు. ఈ నెల 4న (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల ప్రాంతంలో) స్టోర్‌లోకి వచ్చిన దుండగుడు ముబిన్‌తో వాగ్వాదానికి దిగి చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్చాడు. రెండు తూటాలు ముబిన్ కాలేయంలోకి దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన ముబిన్ ప్రస్తుతం అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.













