మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF) ఆధ్వర్యములో ఘనంగా ఉగాది వేడుకలు
మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF) ఆధ్వర్యములో వికారి నామ సంవత్సర ఉగాది 2019 వేడుకలను ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సెలంగూర్ స్టేట్ కౌన్సిలర్ గణపతి రావు గారు, మలేషియా ఇండియా హై కమిషన్ కౌన్సిలర్ నిషిత్ ఉజ్వల్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ ప్రఖ్యాత గాయకుడు నాగూర్ బాబు (మనో) గారు మరియు అతని బృందం హరిణి, సాయిచరణ్, అరుణ్, సాహితి, శ్రీకాంత్ తదితరులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. మనో గారు మాట్లాడుతూ విదేశాలలో కూడా మన తెలుగు పండగలు సంస్కృతీ సంప్రదాయాలతో నిర్వహిస్తూ తెలుగూ భాషా మరియు తెలుగు వారి ఉనికి కాపాడుతున్న దాతో కాంతారావు గారిని మరియు ప్రకాష్ గారిని అయన అభినందించారు.
ఈ కార్యాక్రమములో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ MTF ప్రెసిడెంట్ దాతో కాంతారావు గారు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ఈవెంట్ ద్వారా సేకరించిన విరాళాలని చారిటబుల్ ట్రస్ట్ ల కి అందజేశారు. జాతిపిత మహాత్మా గాంధీజి గారి 150 వ జన్మదినం కావున వారి జ్ఞాపకార్థం గాంధీ గారి పైన వీడియో ప్రెసెంటేషన్, మరియు చిన్న స్కిట్ చేసి అందులో పాల్గొన్న వారికీ బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రములో MTF ప్రెసిడెంట్ దాతో కాంతారావు ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్, మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి గారు, PKKTM అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు, TAM వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రావు గారు, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు, తెలుగు ఇంటెలెక్చవల్ సొసైటీ ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు గారు, ఒకే కుటుంబం ప్రెసిడెంట్ అప్పన్న నాయుడు గారు పాల్గొన్నారు.













