మిసెస్ ఇండియా 2019 రన్నరప్‌గా హైదరాబాదీ
మిసెస్ ఇండియా- 2019 పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి చైతన్య పోలోజు.. తనకు దక్కిన పురస్కారాన్ని దిశకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ మహిళ ఈ కిరీటాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిరీటాన్ని అందుకోవడం ఆనందంగా ఉన్నా.. దిశ ఘటన తన మనసును బాధించిందని చెప్పారు. బంజారా మహిళా ఎన్జీవో, డాక్టర్ ఆనంద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో చైతన్య తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు.













