చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఒక అత్యున్నత స్థాయి గౌరవమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ అన్నారు. అమెరికా చట్ట సభలను (కాంగ్రెస్) ఉద్దేశించి ప్రధాని మోదీ రెండవ సారి ప్రసంగిస్తారని, ఇలా చేసిన తొలి భారత ప్రధాని మోదీయేనని తెలిపారు. ప్రధాని మోదీ 2016లో తొలిసారిగా అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించారు. మరే భారత ప్రధానీ ఇలా చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే విన్స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా వంటి బహు కొద్ది మంత్రి మాత్రమే అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి రెండు మార్లు ప్రసంగించారు. కనుక ప్రధాని పర్యటన అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది అని జైశంకర్ వ్యాఖ్యానించారు. జో బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికాలో ఈ నెల 21 నుంచి 24 వరకు పర్యటించనున్న విషయం విదితమే.













