ఇవాంక ట్రంప్ ను భారత్‌కు ఆహ్వానించిన మోదీ
భారత్‌లో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు హాజరుకావాలంటూ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ప్రముఖ వ్యాపారవేత్త ఇవాంక ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. మోదీ ఆహ్వానంపై ఇవాంక సోషల్ మీడియా ద్వారా స్పందించారు. భారత్‌లో ఈ ఏడాది జరగబోయే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు హాజరుకావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. అమెరికా తరపున సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు తనను ప్రాతినిధ్యం వహించాలని మోదీ కోరడం చాలా సంతోషంగా ఉందని, సమ్మిట్‌కి ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అని ఇవాంక తన ట్విటర్లో పేర్కొన్నారు.













