భారతీయుల మనసు ఎంతో గొప్పది : మిస్ అమెరికా
భారతీయుల మనసు ఎంతో గొప్పదని మిస్ వరల్డ్ అమెరికా క్లారిసా బోవెర్స్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బాగా నచ్చిందన్నారు. ప్రపంచంలోని పిల్లలందరికీ మంచి ఆరోగ్యం, చదువుకునేందుకు తగిన సౌకర్యాలు ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. అవసరమైన వారికి విద్య, వైద్య సదుపాయలు కల్పించేలా సేవా సంస్థల ద్వారా నిధుల సేకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో శాంతి, పిల్లల్లో సంతోషం అనే సందేశంతో తెలంగాణ పర్యటనకు వచ్చిన క్లారిసా, యాదాద్రి భువనగిరి జల్లా చౌటుప్పల్లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. దాదాపు రెండు గంటలకు పైగా పిల్లల మధ్య గడిపారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రమించవద్దని విద్యార్థినులకు సూచించారు. సైనిక కుటుంబానికి చెందిన తనకు తల్లిదండ్రులే స్ఫూర్తి అన్నారు. ఆమెకు గురుకుల బాలికలు కాగితాలతో, పువ్వులతో తయారు చేసిన శుభాకాంక్షల ప్రతులను, జ్ఞాపికలను బహుకరించారు.
చౌటుప్పల్ లో మిస్ వరల్డ్ అమెరికా సందడి
మిస్ వరల్డ్ అమెరికా క్లారిస్సా బోవర్స్ సందడి చేశారు. చౌటుప్పల్లోని బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడి వారు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికీ ప్రాథమిక విద్య పునాదిలాంటిదని, బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదుగాలన్నారు.













