TEAM: మిన్నెసోటా తెలుగు సంఘం దీపావళి సంబరాలకు ముహూర్తం ఫిక్స్
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మిన్నెసోటా (TEAM) దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. నవంబర్ 1న మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు ఈడెన్ ప్రేరీ హై స్కూల్‌లోని ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు కళాకారులతో డ్యాన్సులు, పాటలు, నాటకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మిన్నెసోటా తెలుగు సంఘం (TEAM) తెలిపింది.
ఈ వేడుకలో విందు భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ దీపావళి సంబరాల్లో పాల్గొనాలనుకునేవారు tinyurl.com/TEAMDeepavali2025 లింక్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దీపావళి పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని మిన్నెసోటా తెలుగు సంఘం (TEAM) తెలుగు ప్రజలందరినీ ఆహ్వానిస్తుంది. ఈ వేడుకలకు సంబంధించి ఏమైనా సందేహాలున్నా, ఎటువంటి వివరాలు కావాలన్నా cultures@teamn.org కు ఈమెయిల్ ద్వారా లేదా (612) 808-8176 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కల్చరల్ టీమ్‌ను సంప్రదించవచ్చునని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మిన్నెసోటా (TEAM) తెలిపింది.







