అందరినీ తీసుకెళుతాం…కొల్లు రవీంద్ర
ఎన్ని వ్యయప్రయాసలైనా భరించి.. కువైత్‌లోని బాధితులందరినీ స్వరాష్ట్రానికి తీసుకెళ్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కువైత్‌లో అనధికారికంగా ఉంటున్న ప్రవాసాంధ్రులు స్వదేశానికి వెళ్లిపోయేందుకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) పెట్టిన విషయం విదితమే. బాధితులను స్వరాష్ట్రానికి తరలించే విషయమై కువైత్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్న మంత్రి రవీంద్ర గురువారం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కువైట్ ప్రభుత్వ చట్టాలు తెలియక, స్వదేశానికి వెళ్లే అవకాశం లేక ప్రవాసాంధ్రులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రవాసాంధ్రులను త్వరితగతిన ఏపీకి తరలించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై భారత రాయబార కార్యాలయంలో అంబాసిడర్ జీవసాగర్తో చర్చించారు. ఏపీకి విమాన సర్వీసులు నడపాలని జజీరా ఎయిర్వేస్ ప్రతినిధులను కోరగా వారు సానుకూలంగా స్పందించారు.













