భారత్ లో ఎన్నికల కోసం పనిచేశాం
భారత్‌లో ఎన్నికల సమయంలో మైక్రోసాఫ్ట్ అక్కడి అధికారులతో కలిసి పనిచేసిందనీ, పోలింగ్ బూత్‌ల వద్ద జరిగిన పనులు తదితరాలను పరిశీలించిందని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే సమాచార సేకరణ మాత్రం పారదర్శకంగా జరిగిందనీ, వినియోగదారులు (ప్రభుత్వ సంస్థలు) వారి సమాచారాన్ని స్వీయ నియంత్రణలోనే భద్రంగా ఉంచుకునేలా గోప్యత విధానాలను అప్పట్లో రూపొందించామని వెల్లడించారు. ఎన్నికల అధికారులు మా కంపెనీ క్లౌడ్ ప్లాట్‌ఫాంలను కూడా ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించుకున్నారు. కానీ ఆ సమాచారమంతా వారి వద్దనే ఉంది అని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు.













