అరబిందో ఫార్మాపై యూఎస్ లో మెర్క్ కేసు….
ఒక మధుమేహ వ్యాధి ఔషధం విషయంలో అరబిందో ఫార్మా తన పేటెంట్ హక్కులను ఉల్లంఘిస్తోందని యూఎస్‌కు చెందిన అగశ్రేణి ఔషధ సంస్థ మెర్క్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జానుమెట్ అనే బ్రాండెడ్ ఔషధంపై మెర్క్‌కు పేటెంట్ ఉంది. మెట్‌ఫామిన్ హైడ్రోక్లోరైడ్- సిటాగ్లిప్టిన్ ఫాస్పేట్ దీనికి జనరిక్ ఔషధం. జానుమెట్పై యూఎస్‌లో పేటెంట్ గడువు 2022 జులైలో తీరిపోతోంది. పేటెంట్ గడువు తీరిపోవటానికి ముందే ఈ ఔషధాన్ని యూఎస్‌లో విక్రయించేందుకు సిద్ధమైన అరబిందో ఫార్మా ఆ మేరకు యూఎస్ఎఫ్డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) వద్ద ఏఎన్‌డీఏ దరఖాస్తు దాఖలు చేసింది. దీన్ని నిరోధించాలనే ఉద్దేశంతో మెర్క్ యూఎస్‌లోని డెలవేర్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. పేటెంట్ గడువు తీరిపోయే వరకూ ఇతర కంపెనీలు జానుమెట్ ఔషధాన్ని విక్రయించకుండా నిరోధించాలని కోరింది.













