ATA: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆటా సభ్యులు
యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన, యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ఆటా సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక విశిష్టతపై ఆటా సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత మరింత వైభవంగా రూపుదిద్దుకున్న ఈ క్షేత్రం భక్తులను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఒక్కటిగా నిలిపేందుకు ఆటా సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వారు ఇండియా ప్రతినిధులకు వివరించారు. ఆటా ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు, విద్యా సహాయం, యువత అభివృద్ధి కార్యక్రమాలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందించి, ఆటా బృందానికి ఆశీర్వచనాలు అందజేశారు.
హాజరైన వారు ఎవరంటే..
ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు, కో చైర్ నరసింహ ద్యాసాని, సాయి సూదిని, శ్రీకాంత్ గుడిపాటి, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, రామకృష్ణ అల, శ్రీధర్ తిరిపతి, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సి రెడ్డి, విష్ణు మాధవరం, సుమ ముప్పల, తిరుమల్ రెడ్డి, రాజ్ కరకల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, సుమన్ బర్ల, వేణుగోపాల్ సంకినేని, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా, జ్యోత్స్న పలువురు ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు.














