సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానానికి అధ్యక్షులు ట్రంప్ ఎవరిని ప్రతిపాదిస్తే వారికే యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ఓటు : మక్కన్నేల్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే దాని పై వివిధ రకాల చర్చలు జరుగుతునన సమయం లో శుక్రువారం 18 సెప్టెంబర్ న సెనేట్ నాయకులు మిచ్ మక్కన్నేల్ దివంగత సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్ స్థానాన్నికి అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఎవరిని నియమిస్తే వారికి సెనేట్ మద్దతు తెలుపుతుంది అని ప్రకటించారు. “మేము అధ్యక్షులు ట్రంప్‌తో కలిసి పనిచేస్తామని మరియు అతని ఎజెండాకు ముఖ్యంగా ఫెడరల్ న్యాయవ్యవస్థకు మరియు ఆయన చేసిన నియామకాలు కు మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసాము. మేము మా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాము. సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానానికి అధ్యక్షులు ట్రంప్ ఎవరిని ప్రతిపాదిస్తే వారికి యునైటెడ్ స్టేట్స్ సెనేట్ లో ఓటు లభిస్తుంది.” అని మిస్టర్ మక్కన్నేల్ తెలిపారు.
అయితే మిస్టర్ మక్కన్నేల్ అధ్యక్ష ఎన్నికలకు ముందు రూత్ బాడర్ గిన్స్బర్గ్ స్థానాన్ని భర్తీ చేస్తారా లేదా వేచి ఉంటారా అనే విషయం పై స్పష్టత ఇవ్వలేదు. యునైటెడ్ స్టేట్స్ సెనేట్ సభ్యులలో చాలామంది కఠినమైన ఎన్నికల పోటీలను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.కొంతమంది రిపబ్లికన్ సెనేటర్లు బహిరంగంగా మిస్టర్ మక్కన్నేల్ అధ్యక్ష ఎన్నికల రోజుకు కంటే ముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ను ఎన్నుకోవాలి అని తెలిపారు.













