MATA: తెలుగు రాష్ట్రాల్లో ‘మాటా సేవ డేస్’ షెడ్యూల్ ఇదే..!
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) తమ ప్రతిష్టాత్మకమైన ‘మాటా సేవ డేస్’ కార్యక్రమాలు 2026 జనవరి 9 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేవ డేస్ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.
– బ్లాంకెట్స్ పంపిణీ (విశాఖపట్నం) – 2025 నవంబర్ 15
– మానసిక వికలాంగులకు సేవ (విశాఖపట్నం) – 2025 నవంబర్ 26
– ఐడల్ గాంధర్వ అవార్డ్స్ (విశాఖపట్నం) – 2025 నవంబర్ 27
– జనరల్ హెల్త్ క్యాంప్ (సంగారెడ్డి) – 2025 డిసెంబర్ 24
– జనరల్ హెల్త్ క్యాంప్ (సిద్దిపేట) – 2025 డిసెంబర్ 29
– జనరల్ హెల్త్ క్యాంప్ (గుంటూరు) – 2026 జనవరి 4
ఈ మాటా (MATA) సేవ డేస్ కార్యక్రమాలకు శ్రీనివాస్ కానగని, కిరణ్ దొడ్డగాయి, విజయ భాస్కర్ కాలా, శ్రీధర్ గుడాల, ప్రవీణ్ గుడురు, శిరీష గుండపునేని, మహేందర్ నాళ్ల, శ్రీధర్ పెమ్త్యాల, బాబా సి. ఎ. సత్యనారాయణ, దాము గుడాల, రామ్మోహన్ చిన్నాల, మాధవ్ రావు బోళ్ల, శ్రీ విజయ్ శంకర్ బోల్గం స్పాన్సర్లుగా, ఇండియా కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
వీటితో పాటు, మాటా (MATA) 2వ కన్వెన్షన్’-2026ను వచ్చే ఏడాది జూన్ 19-20 తేదీలలో ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో (రాస్మావిల్లే, PA) ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అతిపెద్ద సేవ డేస్ గ్రాండ్ ఫైనల్స్ కార్యక్రమం జనవరి 9న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి జరగనుంది.
ఈ మాటా (MATA) సేవ డేస్ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి రామ్కృష్ణ దొడ్డగాయి, ప్రవీణ్ గుడురు, విజయ్ భాస్కర్ కాలా, శ్రీధర్ గుడాల, రమేష్ చలసాని, టోనీ జన్ను, డా. పద్మశ్రీ గుండపునేని, స్వాతి అట్లూరి, కళ్యాణ్ బి.పి.ఎల్. ఆశగొంద, మానేజర్ కాలా, శ్రీనివాస్ నక్కల, వంశీకృష్ణ నాకమల, సుమన్ కాయన, ముకుంద్ పెమ్త్యాల, శిరీష గుండపునేని, శ్రీ విజయ్ శంకర్ బోల్గం తదితర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు.






