ట్రంప్ అన్న కుమార్తె పుస్తకానికి భారీ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన అన్న కుమార్తె మేరీ ట్రంప్ రాసిన పుస్తకానికి భారీ స్పందన లభిస్తోంది. అమెరికా వ్యాప్తంగా జరిగిన అమ్మకాల్లో ఒక్కరోజులోనే దాదాపు 10 లక్షల కాపీలు అమ్ముడుపోవడం గమనార్హం. ఈ విషయాన్ని పుస్తకాన్ని ప్రచురించిన పబ్లిషర్ గురువారం ధ్రువీకురించారు. టుమచ్ అండ్ నెవర్ ఎనఫ్ :హౌమై ఫ్యామిలీ క్రియెటెడ్ ది వరల్డ్ మోస్ట్ డేంజరస్ మ్యాన్ పేరుతో ట్రంప్‌పై మేరీ ట్రంప్ ఒక పుస్తకం రాశారు. ఒక అమెరికా అధ్యక్షుడిపై ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తి రాసని మొదటి పుస్తకంగా ఇది నిలిచింది. మేరీ స్వతహాగా ఒక సైకాలజిస్టు. ఆమె తండ్రి ట్రంప్‌నకు పెద్ద అన్న. ట్రంప్ ఒక గర్వి అనీ, ఆజ్ఞాని అని ఆమె తన పుస్తకంలో విమర్శించారు. ముందస్తు ఆర్డర్లతో సహా మంగళవారం ఒక్కరోజులో మొత్తం 9 లక్షల 50 వేల కాపీలు అమ్ముడుపోయాయనీ, ఇది కంపెనీ చరిత్రలో ఒక రికార్డు అని సిమన్ అండ్ స్కస్టర్ పబ్లిషింగ్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.













