MYTA: మలేషియాలో ఘనంగా మైటా బతుకమ్మ సంబరాలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 12వ వార్షిక బతుకమ్మ (Bathukamma) సంబరాలు అట్టహాసంగా జరిగాయి. మలేషియాలో భారత హైకమిషనర్ బీఎన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత పన్నెండేళ్లుగా మైటా (MYTA) చేస్తున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతున్న తీరును ఆయన అభినందించారు. సుమారు 150కి పైగా బతుకమ్మలు (Bathukamma), 2 వేలకు పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనడం తెలంగాణ సాంప్రదాయం సరిహద్దులు దాటి ఎలా విస్తరించిందో చాటిచెప్తోందని బీఎన్ రెడ్డి కొనియాడారు. మిస్ ఆసియా పసిఫిక్ రష్మి ఠాకూర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ జానపద గాయని నాగలక్ష్మి తన గానంతో ప్రేక్షకులను అలరించారు. డాన్స్ మాస్టర్ నరేష్ ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళలు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకల్లో మైటా (MYTA) అధ్యక్షులు సైదం తిరుపతి, ఉపాధ్యక్షుడు చిరుత చిట్టిబాబు, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి, ప్రధాన కార్యదర్శి సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రెజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రెజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రెసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్ మార్త, మధు, జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, పూర్ణ, అనిల్ రావు, హరీష్, శశి, సలహాదారులు గురిజాల అమర్నాథ్ గౌడ్, సుధీర్, మన్సూర్ అహ్మద్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.