ప్రపంచ వ్యాప్తంగా దీక్షా దివస్ : మహేష్ బిగాల
అమెరికాలోని అట్లాంటాలో, న్యూజెర్సీ లో ప్రత్యక్షంగా దీక్షా దివస్ లో పాల్గొన నున్న మహేష్ బిగాల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేపట్టిన దీక్షకు 12 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని దీక్షా దివస్ మార్చేసింది. తెలంగాణ సమాజం యావత్తు కేసిఆర్ వెంట నిలవడంతో.. కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
ఈ సందర్బంగా అమెరికాలోని అట్లాంటాలో, న్యూజెర్సీ లో ప్రత్యక్షంగా దీక్ష దివస్ లో పాల్గొననున్నట్టు మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించి ప్రపంచ దేశాలలో దీక్ష దివస్ ని జరపాలని ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు, అలాగే దీక్ష దివస్ సందర్బంగా తెలంగాణ అమరులకు అలాగే తెలంగాణ ఉద్యమ నేతలు స్వర్గీయులు ప్రొఫెసర్ జయశంకర్ సర్ ని, విద్యసాగర్ గారికి, నాయిని నర్సింహారెడ్డి గారికి, రామ లింగ రెడ్డి, నోముల నర్సింహయ్య గారికి తదితరులకు నివాళులు అర్పించాలని కోరారు.
అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తు, దానికి ఎల్లప్పుడూ కెసిఆర్ గారికి టి.ఆర్.యస్ పార్టీ కి తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని తెలిపారు.













