సౌత్ అమెరికా ఖండంలోని పెరు దేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాఖ
తెలంగాణ రాష్ట్ర సమితి NRI కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాలా ఈ రోజు పెరు శాఖ కమిటీ ని ప్రకటించారు. సౌత్ అమెరికా ఖండంలోని మొదటి తెరాస శాఖ అని తెలిపారు.
బద్దం రంగారెడ్డి – అధ్యక్షుడు
కోల్కోర్ రామ్ రెడ్డి – ఉపాధ్యక్షుడు
సీబీర్. మల్లేష్ – ఉపాధ్యక్షుడు
పి.హేమంత్ కుమార్ – జనరల్ సెక్రటరీ
జె.శ్రీనివాస్ రావు – మెంబెర్ షిప్ ఇంచార్జి
గండ్ర సందీప్ రెడ్డి – ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్
అజయ్ కుమార్ – ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్
ఉమా రెడ్డి – ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్
వినూత్న పళ్ళ – ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్
S రాజ్ – ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్
అధ్యక్షుడు రంగా రెడ్డి బద్దం ఈ సంవత్సరం తెరాస పార్టీ ప్లీనరీ లో పాల్గొన్న అనంతరం సీఎం కెసిఆర్ గారిని మరియు ఇతర ముఖ్య నాయకులను కలిశారు. ప్రతి క్షణం తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపించే కెసిఆర్ గారి సంకల్పానికి తోడుగా తమ వంతు సహకారం పార్టీకి అందిస్తామని, నిజామాబాదు ఎంపీ శ్రీమతి కవిత కల్వకుంట్ల ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర సమితి NRI కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాలా గారి దిశా నిర్దేశంలో పనిచెయ్యడం సంతోషకరం అన్నారు. తెరాస పెరు శాఖ ఏర్పాటులో సహకారం అందించిన న్యూ జీలాండ్ తెరాస అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన గారికి కృతజ్ఞతలు తెలిపారు.













