న్యూయార్క్ లో గాంధీ నూతన విగ్రహావిష్కరణ

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శ్రీ తులసీ మందిర్ వెలుపల మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్ కుమార్ ఆవిష్కరించారు. సౌత్ రిచ్‌మండ్ హిల్స్‌లో ఉన్న గాంధీ విగ్రహాన్ని 2022 ఆగస్టులో కొందరు దుండగులు రెండుసార్లు ధ్వంసం చేశారు. దీంతో ఆ విగ్రహం స్థానంలో కొత్తది ఏర్పాటు చేశారు.