వేలానికి మడొన్నా ప్రేమలేఖ
పాశ్ఛాత్య సంగీత సామ్రాజి మడొన్నా రాసిన ప్రేమ లేఖను త్వరలో వేలం వేయనున్నారు. 1990లో విడుదల చేసిన జస్టిఫై మైలవ్ వీడియో మ్యూజిక్ చిత్రీకరణ సందర్భంలో మోడల్ అమందా కేజలెట్ను ముద్దాడిన దృశ్యం అప్పట్లో సంచలనం కలిగించింది. కాగా ఆ మరుసటి ఏడాది ఆమె స్వదస్తూరీతో కేజలేట్కు ప్రేమలేఖ రాసింది. ఈ లేఖను ఇప్పుడు వేలం వేయనున్నట్లు వెబ్సైట్ టీఎమ్జె.కామ్ ప్రకటించింది. ప్రారంభ ధర 15 వేల డాలర్లుగా నిర్ణయించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ ప్రేమ లేఖను ఓ హాస్యోక్తితో ఆమె ప్రారంభించినట్లు చెబుతున్నారు. చాలాకాలంగా కలవ లేకపోవడం, విరహాన్ని భరించలేకపోతున్నట్లు ఆ లేఖలో మడొన్నా పేర్కొనట్లు చెబుతున్నారు. అమందా కూడా అందాల భామే. 59 ఏళ్ల మడొన్నా ఎల్జీబీటి. ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. జులై 11 నుంచి 20వ తేదీ మధ్య వేలం నిర్వహించనున్నారు.













