లాక్ హీడ్ మార్టిన్ నుంచి బంపరాఫర్
అమెరికాకు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ భారత్ ముందు ఓ బంపరాఫర్‌ను ఉంచింది. తాము తయారు చేస్తున్న అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఎఫ్-21లకు కనీసం 114 ఆర్డర్ ఇస్తే, వీటిని మరే ఇతర దేశానికి అమ్మబోమని హామీ ఇచ్చింది. ఆధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న ఇండియా, అమెరికా, రష్యా తదితర దేశాలతో డీల్ కుదుర్చునే ప్రయత్నాలు చేస్తున్న వేళ, ఈ డీల్ పై కన్నేసిన లాక్ హీడ్ మార్టిన్, మిగతా కంపెనీలతో పోలిస్తే, ముందు నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది.













